AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పదే పదే రాద్దాంతం చేయొద్దు..

ప్రతిపక్షాలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

ప్రభుత్వంపై కక్ష్యపూరితమైన వ్యాఖ్యలు మానుకోవాలని ప్రతిపక్షాలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హితవు పలికారు.నిరుద్యోగులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.పేపర్ లీకేజ్ ఘటనపై పదే పదే రాద్దాంతం చేసి.. విద్యార్థులను పక్కదారి పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే నిందితును అరెస్టు చేశామని..విచారణ చేసి కఠినంగా శిక్షపడేలా చూస్తామన్నారు.అంతేకాని ప్రతి సారి కేటీఆర్ రాజీనామా చేయాలని, కేసీఆర్ రాజానామా చేయాలని అనడం సరికాదన్నారు.బీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.టీఎస్పీఎస్సీలో ఇద్దరు ఇంటి దొంగల వల్ల పేపర్స్ లీక్ అయ్యాయన్నారు.రాజ్యాంగబద్ధ సంస్థపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. అలా చేయడం సరికాదని చెప్పారు.టీఎస్పీఎస్సీ మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.నిరుద్యోగులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని.. ధైర్యంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా అకాల వర్షాలతో పంట నష్టం జరగటం దురదృష్టకరమన్నారు.రంగారెడ్డి,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలో పంట నష్టం తీవ్రంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించినట్టు తెలిపారు. రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు సాయం చేయాలన్నారు.గతంలో ఏడువేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగితే.. రూ.250 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని మండిపడ్డారు.తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు అండగా ఉండటాన్ని కేంద్రం ఓర్చుకోలేకపోతుందని విమర్శించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10