AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోవిడ్‌ కట్టడికి తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయాలు

తెలంగాణలో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ సూచలన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సంబంధిత శాఖ అధికారులతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు మంత్రి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి హరీష్ రావు. అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. అలాగే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు లేఖలు రాసింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది కేంద్రం. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.. శుక్రవారం నాడు అధికారులతో రివ్యూ నిర్వహించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10