AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేపర్‌ లీకేజీ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ పలు కీలక విషయాలను వెల్లడించారు సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు. దర్యాప్తులో కొందరు రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యమయ్యాయని అన్నారు సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు.. రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ రెడ్డి పాత్ర కీలకంగా మారిందన్నారు. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కలిసి లక్ష్మీని ట్రాప్ చేశారని సిట్ అధికారి చెప్పడం విశేషం.

లక్ష్మీ దగ్గర పాస్‌వర్డ్, ఐడీలను దొంగలించారని.. మొత్తం ఐదు పేపర్లను కాపీ చేసుకున్నట్లు సమాచారం. ఏయే పేపర్లు లీక్‌ అయ్యాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏఈ పరీక్ష పేపర్‌ను రేణుకకు అమ్మింది ప్రవీణ్‌ అని తెలిపారు. గ్రూప్‌ 1 పరీక్ష పేపర్‌పై దర్యాప్తు చేస్తున్నామని.. ప్రవీణ్‌ రాసిన పరీక్షలో అధిక మార్కులు రావడంపై దర్యాపు సాగుతుందన్నారు.

ప్రవీణ్‌ ఎవరెవరికి పేపర్‌ ఇచ్చారన్నదానిపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, మరికొందరి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సిట్ అధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10