AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హాఫ్‌ మారథాన్‌.. ఫుల్‌ జోష్‌..

జయశంకర్ జిల్లాలో జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియం వేదికగా నిర్వహించిన హాఫ్‌ మారథాన్ రన్ -2023 సెకండ్ ఎడిషన్ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ రన్ లో దాదాపు 700 మంది వయస్సుతో సంబంధం లేకుండా యువతి, యువకులు, ప్రజా ప్రతినిధులు అధికారులు, సిబ్బంది, చిన్నారులు 5K,10K,21.1Kలో రన్ లో పాల్గొన్నారు. అనంతరం 21k, 10k, 5k విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాలుగా బహుమతులను అందజేశారు. అనంతరం యువత తో జుంబ డాన్స్ తో కేరింతలు పుట్టించారు.

మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్న వేళ, జీవన ప్రమాణాలతో పాటు ఆహార ఆరోగ్య అలవాట్ల వస్తున్న మార్పులతో ఈ బిజీ ప్రపంచంలో మనిషికి కావాల్సిన శారీరక శ్రమ లేక ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రజలలో అందుకు కావాల్సిన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లి రన్ నిర్వహించడం జరిగిందని భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, వారి సతీమణి, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా భారాస పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10