AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇసుక దోపిడీతో రూ.కోట్లు గడిస్తుండ్రు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..
ఇసుక దోపిడీతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రూ.కోట్లు గడిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం పాలనతో కూడిన సామాజిక తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీంగల్ లోని లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. చారిత్రక లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. నరసింహస్వామి సాక్షిగా నేను ప్రశ్నిస్తున్నా..తెలంగాణ వచ్చినా ఇక్కడి రైతులను ప్రభుత్వం ఆదుకుందా అని అడిగారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణలో నిరుద్యోగుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదని మండిపడ్డారు.

తెలంగాణ వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదన్న రేవంత్..పోరాటంలో, పట్టుదలలో, పౌరుషంలో నిజామాబాద్ రైతులు హర్యానా రైతులకు తక్కువేం కాదన్నారు. కేసీఆర్ కుడి భుజం అని చెప్పుకునే మంత్రి ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా..ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమను ఎందుకు మూసివేశారు..ఎందుకు ఇక్కడి రైతులను ఆదుకోవడంలేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం లేదా.. లేదా.. చైతన్యం కలిగిన రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి అని రేవంత్ రెడ్డి కోరారు. సుదర్శన్ రెడ్డి, మండవ లాంటి గొప్ప నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి ఈ ప్రాంతం గౌరవాన్ని పెంచారు..కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లా పరువు తీస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఏ దోపిడీ చూసినా మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్, జీవన్ రెడ్డిపేర్లే వినిపిస్తున్నాయన్నారు. ఇసుక దోపిడీ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి..ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదవన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10