AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టెర్రరిజాన్ని అణచివేస్తున్నాం

హైదరాబాద్ : ఉగ్రవాదం, నక్సలిజంలలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. గతంలో అటువైపు వెళ్లినవారిలో అనేక మంది ప్రధాన జీవన స్రవంతిలో చేరుతున్నారన్నారు. ఉగ్రవాదం , నక్సలిజంలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం 54వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు.

సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందదని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని, దీనిని సాధించడంలో సీఐఎస్ఎఫ్ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు.

గతంలో ఈ ఉత్సవాలు న్యూఢిల్లీలోనే జరిగేవి. న్యూఢిల్లీ వెలుపల ఈ ఉత్సవాలు జరగడం ఇదే మొదటిసారి. నక్సలైట్లు అకస్మాత్తుగా దాడి చేస్తే సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా ఎదుర్కొంటారో తెలిపేందుకు ఓ నమూనా ప్రదర్శన జరిగింది. ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన ఈ ప్రదర్శనను చూసినవారంతా అవాక్కయ్యారు. కేరళకు చెందిన ప్రాచీన మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు విన్యాసాలను మహిళలు ప్రదర్శించారు. ఈ విన్యాసాలతో మహిళలు ఆహూతులందిరినీ మంత్రముగ్ధులను చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10