అహ్మదాబాద్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాల్గవ టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేశాడు. 241 బంతుల్లో 5 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 28 శతకాన్ని నమోదు చేశాడు. చివరి సారిగా 2019 నవంబర్ 22న కోహ్లీ బంగ్లాదేశ్ పై టెస్టులో సెంచరీ చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 140 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్ (5), కోహ్లీ (100) రన్స్ చేసి కొనసాగుతున్నారు.