ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో రైజ్ అండ్ రన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థినులు హాజరయ్యారు. ఈవెంట్‌లో భాగంగా 2k, 5కే రన్ జరిగింది. ఈ క్రమంలోనే సీఎస్, డీజీపీలు జుంబా డ్యాన్స్ చేసి ఉత్సహపరిచారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. మహిళలు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చాక షీ టీమ్స్ వచ్చాయన్నారు.
సేఫెస్ట్ స్టేట్‌గా తెలంగాణ ఉందని శాంతి కుమారి పేర్కొన్నారు. మహిళలు అందరూ వెనకడుగు వేయకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే నంబర్ వన్ స్టేట్ తెలంగాణ అని కొనియాడారు. దేశంలోని చాలా రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి మన విధానాలు నేర్చుకుంటున్నాయన్నారు. మహిళా అధికారి ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ పోలీసింగ్ అండ్ షీ టీమ్స్ కార్యక్రమాలని ఇతర స్టేట్స్ చూసి నేర్చుకుంటున్నాయని అంజనీ కుమార్ పేర్కొన్నారు.