ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెమెకలకు గాయాలయ్యాయి. దీంతో ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకుని, ప్రస్తుతం తన ముంబై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పాడు. నటుడు తన బ్లాగ్‌లో తన ఆరోగ్య అప్‌డేట్‌ను పంచుకున్నాడు.