ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగవైభంగా జరిగిన విషయం తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ ఇంట మూడురోజులపాటు పెళ్లి వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు. ముంబయిలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. పెళ్లికి ముందు తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అట్టహాసంగా జరిగాయి. కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించే చర్చించుకున్నారు.
వీరిద్దరు పెళ్లి ధరించిన దుస్తులతో సహా అన్ని వస్తువులకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.అలాగే ఈ పెళ్లికి రూ.5000 కోట్లు ఖర్చు అయ్యాయి. అంబానీ ఆస్తుల్లో రూ.5000 కోట్లు అంటే 0.05 శాతం మాత్రమే. ఇది వారికి చాలా చిన్న ఖర్చు. ఇదిలా ఉంటే రాధిక మర్చంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లైన నాలుగు నెలలకు రాధిక మర్చంట్ తన పేరును మార్చుకున్నారు.
రాధిక మర్చంట్ పెళ్లై ఇన్ని రోజుల తర్వాత అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు. ఆల్రెడీ ఇప్పటికే అఫిషీయల్‌గా కోడలు అయిపోయింది కదా అనుకుంటున్నారా? అవును కానీ.. ఇప్పుడు పేరును కూడా అధికారికంగా ప్రకటించింది. మర్చంట్ ప్లేస్‌లో అంబానీ అని మార్చుకున్నారు.అధికారికంగా పేరులో మార్పు చేసుకున్నారు. కొంతమందికి పెళ్లి తర్వాత అత్తారింటి పేరు వస్తుంది. కానీ కొందరు తమ ఇంటి పేరుతోనే కొనసాగుతారు. రాధిక మర్చంట్ మాత్రం తన అత్తవారి ఇంటి పేరు పెట్టుకోవడానికే మొగ్గు చూపించారు.