తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు డివైడర్‌ను ఢీ కొట్టడంతో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. తిరుపతి అలిపిరి డిపోకి చెందిన ఆర్టీసి బస్సు ఆదివారం రాత్రి తమిళనాడు తిరువణ్నామలై నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థాలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. గాయపడ్డవారిలో ఎక్కువగా చిన్నారులు ఉన్నారు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో కాళ్లు, చేతులు విరిగిన వారు ఎక్కువగా ఉన్నారు అని తెలిపారు. ఘటనా స్థలం రాత్రి 12 గంటల సమయంలో ఆ ప్రాంతం మొత్తం చిన్నారుల కేకలతో, గాయపడ్డవారి కేకలతో హృదయవిదారకంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థాలానికి 4 అంబులెన్స్‌లను పిలిపించి ఎప్పటికప్పుడు గాయపడిన వారిని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఈ ఘటనకు కారణం రాత్రి సమయంలో ఢ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తులోకి జారుకోవడం అని పోలీసులు తెలిపారు.