అమ్మన్యూస్ ఆదిలాబాద్ :
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండగను ఘనంగా నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. దసరా పండగను పురస్కరిచుకొని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ లో కుటుంబ సభ్యులతో కలసి వైదిక అర్చకుల మంత్రోర్చణల నడుమ దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతిఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్ధించారు.అనంతరం క్యాంపు కార్యాలయ ఆవరణలో వాహనాలకు సైతం పూజలు చేసారు. జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు బంధు మిత్రులు శ్రేయోభిలాషులు కంది శ్రీనివాసరెడ్డికి స్వీట్ తినిపించి ఆలింగనాలతో పండగ శుభాకాంక్షలు తెలియచేశారు .దీంతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతిఒక్కరిని పలకరించి వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.