డైట్ కాలేజి మైదానంలో రావణ దహనం
పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి
(అమ్మన్యూస్, ఆదిలాబాద్):
సనాతన హిందూ ఉత్సవ సమితి కేఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. డైట్ కాలేజి మైదానంలో రావణ దహనం కనువిందు చేసింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి కంది శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులతో హాజరయ్యారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించారు. అంతకుముందు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలోనూ దసరా వేడుకలు నిర్వహించారు.