ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కేరళ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అక్కడి లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇది వరకు కేరళలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమరాగ్ని ముగింపు యాత్రలో కూడా పాల్గొన్నారు. ఆ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొనడంతో జనసంద్రాన్ని తలపించింది. అదిరిపోయే స్పీచ్ కూడా ఇచ్చాడు. తాజాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా హస్తం శ్రేణులను సీఎం రేవంత్ రెడ్డి దిశ నిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజున రేవంత్ హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఈనెల 18వ తేదీన రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. 19న మహబూబ్నగర్, మహబూబాద్ సభల్లో ఆయన పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం.
