AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు రూపొందించగా తాజాగా ఆమోద ముద్ర వేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడటం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బిల్లులకు ఆమోదముద్ర పడిన అనంతరం సభ రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన బీసీ నేతలు అంతా మీడియా పాయింట్ వద్ద సమావేశం అయ్యి ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సర్కార్ ఇచ్చిన మాటకు కట్టుబడి, సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు కృషి చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

పార్లమెంట్‌లో ఆమోదం కోసం కృషి చేస్తాం: ఆది శ్రీనివాస్

 

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నేరువేరుతుంతే ఆనందంగా ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా.. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలులోకి వస్తే బీసీ రిజర్వేషనస్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. తాము బాధ్యతలు స్వీకరించిన వెంటనే 2024 ఫిబ్రవరి 4న బీసీ కులగణన ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గవర్నర్ కు ప్రతిపాదన పంపితే దాన్ని ఉపసంహరించుకుని 42 శాతం పెంచేందుకు కొత్త ప్రతిపాదన పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు తాము కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

 

బీసీ బిల్లు దేశానికే రోల్ మోడల్: పొన్నం

 

అంతకు ముందు, అసెంబ్లీలో బీసీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. బీసీ బిల్లు దేశానికే రోల్ మోడల్ అవుతుందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కల్పించడం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని.. ఈ నిర్ణయం దేశానికే ఒక ఆదర్శం మంత్రి చెప్పుకొచ్చారు. బ్యాక్ వర్డ్ క్లాస్ అంటే సమాజానికి, దేశానికి బ్యాక్ బోన్ అని వ్యాఖ్యానించారు. బీసీ బిల్లును పక్కాగా రూపొందించామని తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లుపై సమగ్రంగా చర్చ జరిగిందని.. బీసీ బిల్లుకు మతమపరమైన రంగు పూయవద్దని. బీసీ బిల్లుకు న్యాయపరమైన చిక్కులు రాకపోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10