AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.500కే గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం జీవో జారీ, మార్గదర్శకాలు ఇవే…

అమ్మన్యూస్‌, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలలో రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందజేసే పథకానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకానికి కూడా మరికాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ కోసం మూడు ప్రమాణాలను (మార్గదర్శకాలు) ప్రభుత్వం ప్రకటించింది.

1. సబ్సిడీ సిలిండర్‌ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి.
2. తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండాలి.
3. ప్రజాపాలన దరఖాస్తుదారు పేరటి యాక్టివ్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలి.

ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్‌ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు. సిలిండర్‌ తీసుకున్న తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వినియోగదారుల ఖాతాలో వేయనున్నాయి. మహాలక్ష్మి పథకానికి ఇప్పటివరకు సుమారు 39లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. దారిద్ర రేఖకు దిగువున ఉండి, ఆహార భద్రత కార్డులో పేర్లు నమోదై వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది.

రాష్ట్రంలో 90లక్షల తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా.. వాటిని కలిగున్న వారిలో వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారు 64లక్షల మంది. ఆ గ్యాస్‌ కనెక్షన్‌ నెంబర్‌, బ్యాంకు ఖాతా నెంబర్‌, ఆధార్‌ సంఖ్య, ఆహార భద్రత కార్డు నెంబర్‌.. అన్నీ పక్కాగా ఉన్న దాదాపు 39లక్షల మందిని లబ్దిదారులుగా ఎంపిక చేశారు. ఉజ్వల్‌ పథకంలో లబ్దిదారులుగా ఉన్న వారికి కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10