AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు ముందడుగు పడింది..

కేటీఆర్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు యథాతథంగా ఉంటాయన్నారు. ఉద్యోగులతో చర్చించి.. పదవీ విరమణ బెన్ఫిట్స్ నిర్ణయిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తామని చర్చలో భాగంగా పువ్వాడ తెలిపారు.

కాగా.. ఇదే సభలో తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లును కూడా మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. బాన్సువాడ, ఆలేరు మున్సిపాలిటీల్లో పలు గ్రామాలను పంచాయితీరాజ్‌లో కలుపుతూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది. దీంతో పాటు పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లుకూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం శాసన సభ నిరవధిక వాయిదా పడింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10