తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. మొన్నటి వరకు మద్యం కుంభకోణం కేసు నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కీలక ఆరోపణలు చేశాడు.. జైలు నుంచే లేఖలు విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్.. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేశాడు. మొన్నే తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేయగా.. దానిపై అదే స్థాయిలో మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తే తనకు తెలియదని.. క్రిమినల్, ఫ్రాడ్ అయిన సుఖేష్ తనపై హాస్యస్పదమైన ఆరోపణలు చేస్తున్నాడంటూ కొట్టిపారేశాడు. కాగా.. కేటీఆర్ చేసిన కామెంట్లపై ఇప్పుడు సుఖేష్ చంద్రశేఖర్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుఖే.. జైలు అధికారుల పర్మిషన్‌తో లాయర్ ద్వారా కేటీఆర్‌కు రెస్పాన్స్ ఇచ్చాడు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని.. వాటిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని.. అన్నింటికీ తగిన ఆధారాలను సీబీఐ అధికారులకు అందజేస్తానని చెప్పుకొచ్చాడు. ఒక మంత్రిగా.. ఉన్న కేటీఆర్ దమ్ముంటే స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరాలని సుఖేష్ డిమాండ్ చేశాడు. ఒకవైపు లీగల్ నోటీసులు పంపించి.. మరోవైపు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం అర్థరహితమంటూ సుఖేశ్ పేర్కొన్నారు.