AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ పెద్దల చూపు యంగ్‌ టైగర్‌ వైపు.. కాషాయ నేతల వ్యూహం అదేనా..?!

పాన్‌ ఇండియా స్టార్‌ గా గుర్తింపు పొందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ పెద్దలు సైతం జూనియర్‌ ఎన్టీఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఏపీ బీజేపీ బాధ్యతలను పురందేశ్వరికి అప్పగించినట్లు వినికిడి. అలాచేస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌ను దగ్గర చేసుకోవచ్చని పార్టీ అధినాయకత్వం అంచనా.. ప్రస్తుతం ఏపీలో పార్టీకి పెద్దగా బలం లేదు. కొద్దిమంది బడా బడా నేతలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఆకట్టుకునే మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఎవరూ లేరు అన్నది బీజేపీ పెద్దల భావిస్తున్నారట.. అంతేకాదు జూనియర్‌ కు ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌.. క్షేత్ర స్థాయిలో బలం పెంచే అవకాశం ఉందని లెక్కలేసుకుంటున్నారట.. ప్రస్తుతం టీడీపీ కార్యక్రమాలకు, చంద్రబాబు నాయుడుకు దూరంగా ఉంటున్న యంగ్‌ టైగర్‌ ను తమవైపు తిప్పుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తాజా పరిణామాల బట్టి తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలుగు దేశం పార్టీకి నిజమైన వారసుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పలువురు నమ్ముతున్నారు. ఆయన రూపం, హావ భావాలు, వాక్పటిమ సీనియర్‌ ను గుర్తుకు తెస్తుందని అంటుంటారు. టీడీపీకి మళ్ళి పూర్వ వైభవం రావాలంటే యంగ్‌ టైగర్‌ ను పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఆశిస్తున్నారు. జూనియర్‌ మాత్రం పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కుప్పం నుంచి ప్రారంభమైన నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరైనా, జూనియర్‌ మాత్రం హాజరుకాలేదు.

లోకేష్‌ భవిషత్తు దృష్ట్యా జూనియర్‌ ను పార్టీ పరంగా పక్కన పెట్టారనే ప్రచారం ఉంది. పార్టీకి తన తండ్రికి కూడా సరైన న్యాయం జరగలేదని జూనియర్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే పార్టీలో జరుగుతున్న పరిణామాలను జూనియర్‌ మౌనంగా పరిశీలిస్తున్నట్లు చెపుతారు. ఈ నేపధ్యంలో జూనియర్‌ ను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి వ్యూహత్మకంగా పురందేశ్వరి ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10