బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం పట్ల మనస్తాపానికి గురై బీజేపీ నేత ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ జూలై 4న సాయంత్రం తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబసభ్యులు ఆయణ్ని వెంటనే ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
‘బండి సంజయ్ అన్నా.. ఇక సెలవ్’ అంటూ గజ్జెల శ్రీనివాస్ సూసైడ్ లెటర్ రాశారు. ‘బండి సంజయ్ అన్నను రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తొలగించడం నాకు బాధాకరం. నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎవరి మీదో కోపం కాదు. నేను పెంచుకున్న ప్రేమ అన్న మీద. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని గజ్జెల శ్రీనివాస్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆస్పత్రితో చికిత్స పొందుతున్న బీజేపీ నేత శ్రీనివాస్
బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి తొలగించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రకటన రావడంతో మనస్తాపానికి గురై ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఖమ్మం ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు సూసైడ్ లెటర్‌ను రాసిపెట్టారు గజ్జెల శ్రీనివాస్.