AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్‌పై కేసు.. ఎందుకంటే..

తెలంగాణ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్‌పై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. కట్నం కోసం వేధించడంతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారంటూ కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా కోర్టు ఆదేశించింది. తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సందీప్ కుమార్ ఝూపై గృహహింస, వరకట్న వేధింపుల ఆరోపణలు చేశారు. పెళ్లైన తర్వాత అధిక కట్నం తీసుకురావాలని తనను వేధింపులకు గురి చేశారంటూ సందీప్ కుమార్‌ ఝూపై ఆయన భార్య కోర్టును ఆశ్రయించారు. దీంతో సందీప్‌కుమార్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది.

తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా సందీప్ కుమార్ ఝూ పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లా.. 2021లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోర్బా ప్రాంతానికి చెందిన ఓ యువతితో సందీప్ కుమార్ ఝూ వివాహం జరిగింది. యువతి కుటుంబసభ్యులు భారీగా ఇచ్చినట్లుగా సమాచారం. నగదుతో పాటు భారీగా బంగారు నగలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ పెళ్లైన తర్వాత కూడా అదనపు కట్నం కోసం తనను సందీప్ కుమార్ వేధించినట్లు భార్య ఆరోపించారు.

వరకట్న వేధింపులు మాత్రమే కాకుండా మరో సంచలన ఆరోపణ చేశారు సందీప్ కుమార్ ఝూ భార్య. అసహజ శృంగారానికి సహకరించాల్సిందిగా బలవంతం పెట్టేవాడని ఆమె కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సందీప్ కుమార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో కోర్బా ఎస్సీకి సందీప్ కుమార్ ఝూ భార్య ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్తించింది. తాను ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కోర్బా కోర్టును భార్య ఆశ్రయించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10