AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరానికి పెట్టిన ఖర్చెంత? ఎత్తి పోసిన నీరెంత?

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీత

హైదరాబాద్‌: కాళేశ్వరానికి పెట్టిన ఖర్చెంత? ఎత్తి పోసిన నీరెంత? అని ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత నేత భట్టి విక్రమార్క నిలదీశారు. శాసన సభలో బడ్జెట్‌పై చర్చ జరిగినప్పుడు శాసన సభలో భట్టి మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు పెట్టుకున్న ఆశలను నిరాశపరిచారని, అంకెలు పెద్దగా ఉన్నాయి.. కేటాయింపులు చిన్నగా ఉన్నాయి.. అంటూ సీఏల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

కృష్ణ జలాల్లో మన వాటా ఎంతో ఇప్పటి వరకు తేల్చలేదని, సాగర్‌ ఎడమ కాలువకు నీరు రాకపోతే ఖమ్మం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. కొత్త ప్రాజెక్టులు సాధించకపోతే ఉన్న ప్రాజెక్టులనైనా కాపాడాలన్నారు. కాళేశ్వరానికి పెట్టిన ఖర్చెంత? ఎత్తి పోసిన నీరెంత? అని ప్రభుత్వాన్ని భట్టి నిలదీశారు. ఈ సారైన రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సూచించారు.

పేదలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్‌ బోర్డులు నిర్మించాలని కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ పేదల కోసం ప్రభుత్వం గృహాలు నిర్మించాలన్నారు. విద్యార్థుల మెస్‌ బిల్లులను నెలకు మూడు వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఆరోగ్య శ్రీ కింద సేవలు అందడంలేదని, బిల్లులు రాకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు ఎత్తేస్తున్నాయని మండిపడ్డారు.

పేదలు ఒక్కసారి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలు పాటించడం లేదని, హైస్కూల్‌ స్థాయి విద్యకే లక్షలో ఫీజులు వసూలు చేస్తున్నారని, తెలంగాణలో రెసిడెన్షయల్‌ పాఠశాలలకు సరైన భవనాలు లేవని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే గదిలో తరగతులు, హాస్టల్‌ను నిర్వహిస్తున్న దుస్థితి నెలకొందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10