ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయ్యింది తుళు అందం కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా మారింది. అయితే ఈ మధ్య ఈ భామ నటించిన దాదాపుగా అన్ని సినిమాలు పోతున్నాయి. ఈ భామ ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీలో నటించింది.
ఈ సినిమా మే12న విడుదలైంది.కృతి శెట్టి పర్సనల్ విషయానికి వస్తే.. పుట్టి పెరిగింది ముంబైలోనే. వీళ్ల నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్‌గా పలు సినిమాలకు పని చేసారు. అంతేకాదు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. తన అందంతో లక్షల్లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తాజాగా తన అందాల పిక్స్‌ను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.