నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఎంసెట్ రాయడానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన యువతిని.. ఆస్పత్రికి తరలించి సమాయానికి పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎంసెట్ రాయడానికి వెళ్తున్న దారావత్ అశ్వితకు చెన్నారావుపేట మండలం జల్లి క్రాస్ రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. అదేసమయంలో అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే.. యాక్సిడెంట్ లో గాయపడిని అశ్వితను, ఆమె సోదరుడిని నర్సంపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తక్షణమే ప్రాథమిక వైద్యం అందించి.. ఎగ్జామ్ రాయడానికి పంపించారు. పరీక్ష బాగా రాయాలని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.
