ప్రిన్సెస్ డయానాకు నేటికీ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఆమె ను అప్పుడే కాదు ఇప్పటికీ ఒక ఫ్యాషన్ దివాగా అభిమానిస్తుంటారు. తాజాగా ఆమె పలు సందర్భాల్లో ధరించిన పర్పుల్ వెల్వెట్ బాల్ గౌన్ ఇప్పుడు (purple velvet ball gown) ను వేలం వేశారు. Princess Diana gown auction: 6 లక్షల డాలర్లు ఆ చారిత్రక పర్పుల్ వెల్వెట్ బాల్ గౌన్ (purple velvet ball gown) న్యూయార్క్ లోని సదబీస్ వేలం (Sotheby’s auction) లో 6 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. వేలం ముందు అంచనా వేసిన మొత్తం కన్నా ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఇప్పటివరకు ప్రిన్సెస్ డయానా (Princess Diana) దుస్తుల్లో అత్యంత ఎక్కువ ధర పలికినది ఈ గౌన్ కేనని ఫోర్బ్స్ మేగజీన్ వెల్లడించింది. ఈ గౌన్ (purple velvet ball gown) ను ప్రిన్సెస్ డయానా (Princess Diana) 1991 లో తొలిసారి రాయల్ పోర్ట్రయిట్ కోసం ధరించారు. ఆ తరువాత 1997 లో ఒక ఫొటో షూట్ కోసం ధరించారు. మొదట ఈ గౌన్ (purple velvet ball gown) ను 1997 లో తొలిసారి వేలం వేశారు. చారిటీ కోసం చేసిన ఆ వేలంలో ఈ గౌన్ కు 24,150 డాలర్లు లభించాయి.
కేన్సర్ , ఎయిడ్స్ పేషెంట్ల సహాయార్థం ప్రిన్సెన్ డయానా (Princess Diana) తన 79 గౌన్లను వేలం వేశారు. తద్వారా వచ్చిన 30 లక్షల డాలర్లను సంబంధిత చారిటీ సంస్థలకు అందజేశారు. ఈ స్ట్రాప్ లెస్ ఈవినింగ్ బాల్ గౌన్ ను బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ విక్టర్ ఎడెల్ స్టీన్ ఇన్ ఫాంటా (Infanta) స్టైల్ లో డిజైన్ చేశారు. 1982 నుంచి 1993 వరకు ప్రిన్సెస్ డయానా (Princess Diana) డ్రెసెస్ ను బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ విక్టర్ ఎడెల్ స్టీన్ డిజైన్ చేశారు. Princess Diana gown auction: జాన్ ట్రవోల్టాతో డ్యాన్స్ సదబీస్ వేలం (Sotheby’s auction) లో ఈ గౌన్ కు గరిష్టంగా 1.2 లక్షల డాలర్లు రావచ్చని అంచనా వేశారు. అయితే, అనూహ్యంగా డిమాండ్ పెరిగి, 6.04,800 డాలర్లకు అమ్ముడు పోయింది. 1985లో వైట్ హౌజ్ లో హాలీవుడ్ స్టార్ జాన్ ట్రవోల్టాతో డాన్స్ చేసిన సమయంలో ప్రిన్సెస్ డయానా (Princess Diana) ధరించిన బ్లాక్ ఆఫ్ ది షోల్డర్ గౌన్ ఇప్పటివరకు అత్యధికంగా 3,47,000 డాలర్లకు అమ్ముడుపోయింది.