జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. అది అలా ఉంటే జాన్వీకి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వజ్రాలు పొదిగిన వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతుంది. జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే.