AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రీతిని వేధించినట్లు ఆధారాలు లభ్యం

సైఫ్‌ ఫోన్‌ చాటింగ్‌లో కొత్త విషయాలు..

వరంగల్‌ : కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సైఫ్‌ అనే విద్యార్థి వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తొలి నుంచి వార్తలు వచ్చాయి. కాగా.. సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రీతిని సైఫ్‌ వేధింపులకు గురి చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. సైఫ్‌ ఫో¯Œ ను చెక్‌ చేసిన పోలీసులకు చాటింగ్‌లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాసేపట్లో వరంగల్‌ సీపీ రంగనాథ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించనున్నారు. మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉంది. హైదరాబాద్‌ నిమ్స్‌ లో ఆమెకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియ¯Œ , కార్డియాలజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. డాక్టర్‌ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేప్పటికే పలు అవయవాలు పనిచేయడం లేదని, ఆమెను వెంటిలేటర్‌ సపోర్ట్‌తో తరలించినట్లు నిమ్స్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. నిమ్స్‌లో డాక్టర్‌ ప్రీతిని గవర్నర్‌ తమిళిసై గురువారం పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘ఇది చాలా బాధాకర పరిస్థితి. ఒక డాక్టర్‌గా నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అని వ్యాఖ్యానించారు. వైద్యులు చేయాల్సిందంతా చేస్తున్నారని.. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని అన్నారు. గవర్నర్‌ వద్ద.. ప్రీతి తల్లిదండ్రులు భోరున విలపించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10