నాగలి పట్టే రైతులే దేశాన్ని ఏలాలి
భారత్ పేద దేశం కానేకాదు
నాందేడ్ బీఆర్‌ఎస్ సభలో కేసీఆర్
నాందేడ్: మరఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నాందేడ్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా కెేసీఆర్ మాట్లాడుతూ దేశ నాయకత్వంలో మార్పు రావాలన్నారు. దేశంలో పూర్తి స్థాయిలో కరెంటు, సాగు, తాగునీరు అందడంలేదన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. ప్రధానులు, పార్టీలు మారాయి కానీ దేశంలో పరిస్థితులు మారలేదని దుయ్యబట్టారు. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే నీరు, విద్యుత్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌కు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. దేశ పరిస్థితులను మార్చేందుకు టీిఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చామన్నారు. దేశ నాయకత్వంలో మార్పు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. కుల మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు రాకూడదన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎందుకీ ఈ దుస్థితి ఎలా వచ్చిందని కేసీిఆర్ ప్రశ్నించారు. దేశ జనాభాలో 42 శాతం రైతులే ఉన్నారన్నారు. తాము బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదన్నారు. భారత దేశం మేధావుల దేశం అని ప్రశంసించారు. భారత్ పేద దేశం కానేకాదని, చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలంగా మారుతామన్నారు.
భారత్ బుద్ధిజీవుల దేశమని నాందేడ్‌లో తలపెట్టిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో అన్నారు. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన టైం వచ్చిందని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థులు కాదు.. ప్రజలు, రైతులు గెలవాలని ఆకాంక్షించారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని, దేశంలో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి మరెక్కడా లేదని అన్నారు. కానీ ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో అనేక నదులు ఉన్నా నీటి కరువు ఎందుకని ప్రశ్నించారు. దేశ పరిస్థితులను చూశాక టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చామని కేసీఆర్ ప్రస్తావించారు.