AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డియర్‌ సర్కార్‌.. సమాధానం చెప్పండి

ఐదు ప్రశ్నలు ఎక్కుపెట్టిన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ

హైదరాబాద్‌: వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై వివాదాస్పదన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ సీరియస్‌గా స్పందించారు. ఇన్ని రోజులు అనవసరమైన వాటికి ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టి నానా హంగామా చేసే ఆర్జీవీ.. ఈ ఘటనపై ముందు నుంచి సర్కారుపై విరుచుకుపడుతున్న ఆర్జీవీ.. ఇప్పుడు ప్రజల్లో ఒకరిగా ఐదు ప్రశ్నలను సర్కారుపైకి ఎక్కు పెట్టారు. ఈ ప్రశ్నలకు సర్కారు స్పష్టమైన సమాధానాలు చెప్పేవరకు విడిచిపెట్టొద్దని నెటిజన్లకు పిలుపునిచ్చారు కూడా.

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఘటనపై చాలా మంది సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా.. సర్కారుతో పాటు జంతు ప్రేమికులపై విరుచుకుపడుతున్నారు. సర్కారుపై ఆర్జీవీ ఎక్కుపెట్టిన ప్రశ్నలేంటంటే..

1. ప్రజలు సురక్షితంగా బయట తిరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలేంటీ.. మా మధ్య మేం చర్చిస్తున్నాం.. అనటం సమాధానం కానే కాదు. ఎందుకంటే.. బయట కుక్కలు జనాలకు పీక్కు తింటున్నాయి.

2. పిల్లలను చంపడం కంటే కుక్కల సంరక్షణ చాలా ముఖ్యం అని మీరు విశ్వసిస్తే, అన్ని వీధి కుక్కలను పట్టుకుని డాగ్‌ షెల్టర్‌లకు తీసుకెళ్లటం కంటే.. వాటిని దత్తత తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తే సరిపోతుంది.

3. నాలుగు కోట్లకు పైగా ఉన్న వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రభుత్వం దగ్గర వనరులు లేవనుకుంటే.. తమని తాము చూసుకునేందుకే కష్టంగా ఉందని భావిస్తే.. కుక్కల ప్రేమికులు ఎందుకని వాటి సంరక్షణ కోసం టాక్స్‌ రూపంలో డబ్బు చెల్లించకూడదు.

4. వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్టెరిలైజేషన్‌ ప్రక్రియ.. దీర్ఘకాలికమైనది. దాని ద్వారా ఫలితాలు చాలా ఆలస్యం అవుతాయి. కానీ.. మేం మాట్లాడుతుంది ప్రస్తుతం మనుషులను చంపుతున్న కుక్కల సంగతేంటి.

5. నాలుగు సంవత్సరాల బాలున్ని కోల్పోయి.. బాధిత కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించినదానికి ప్రభుత్వం ఎంత పరిహారం చెల్లించబోతోంది.. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి లాంటి బాధ్యత గల ప్రముఖులు స్వతహాగా ఇంకెంత నగదు సాయం చేయబోతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10