AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆంధ్రా కోసం మరో భారీ త్యాగం చేస్తున్న కేసీఆర్

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. తొలి, మలి దశల్లో ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు అయింది.. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది . రాజకీయ పునరేకీ కరణ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను భారత రాష్ట్ర సమితిలో చేర్చుకున్నది ప్రతిపక్ష పార్టీల్లో తన కోవర్టులను పెట్టుకున్నది. ఇప్పుడేమో దేశ రాజకీయాలను శాసించాలని కలలుగంటున్నది. మోదీని గద్దె దించాలని మంగమ్మ శపథాలు చేస్తున్నది. సరే ఇదంతా ఒక కోణం. కానీ ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందో… ఇప్పుడు ఆ నీళ్లనే ఆంధ్రకు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ఏకంగా సెక్షన్ 3 పై పోరుకు భారత రాష్ట్ర సమితి బ్రేక్ వేయడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. కృష్ణా జలాల వివాదం పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ వేయాల డిమాండ్ పై కూడా సర్కార్ మౌనం వహిస్తోంది.. అంతేకాదు అధికారులు ఫైలు మొత్తం సిద్ధం చేసినప్పటికీ ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం..

మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నందునే ఔదార్యం చూపిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ప్రయత్నంలో ఉన్న సీఎం కేసీఆర్ కు… ఆంధ్రప్రదేశ్ పై ఉదారత చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి విలువైన భూములు కేటాయించినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. దీనికి తోడు కృష్ణా వివాదం పరిష్కారం కోసం జరిపే పోరాటంలోనూ కెసిఆర్ వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది.. అంతర్రాష్ట్ర నది జలాల వివాదాల చట్టం-1956 లోని సెక్షన్_3 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని లేదా ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బాధితులు అప్పగించాలని తెలంగాణ కోరుతున్న విషయం తెలిసిందే.. ఇందుకోసం మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిర్ణయించింది.. ఈ మేరకు అధికారులు రెండు నెలల కిందటే కేసుకు సంబంధించిన అఫిడవిట్లన్నీ సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు..

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10