AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అటవీ భూములను ఆక్రమిస్తే ఊరుకోం

పోడు భూములపై మాకు స్పష్టత ఉంది
ఈ నెలాఖరులోగా పంపిణీ ప్రారంభిస్తాం
అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌: ‘కొందరు విచక్షణ రహితంగా అడవులను నరికివేస్తున్నారు.. అటవీ భూములను ఆక్రమిస్తున్నారు.. ఈ నెలాఖరులోగా పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం.. ఆ తరువాత ఎవరైనా అటవీ భూములను ఆక్రమిస్తే ఊరుకోం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. విపక్షాలు లేవనెత్తిన పోడు భూముల వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదన్నారు. ‘పోడు భూములపై మాకు స్పష్టత ఉంది. సాగు చేసుకునేందుకు భూములను గిరిజనులకు ఇస్తాం. అడవులను నరికివేయడం సరైనదేనా?..పోడు భూముల వివాదానికి ముగింపు పలకాలా? వద్దా? మన కళ్ల ముందే అడవులు నాశనమైపోతున్నాయి. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా? వద్దా? అనేదే ఇప్పుడు సమస్య’గా మారిందని కేసీఆర్‌ అన్నారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని, పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని చెప్పారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడులు చేయవద్దని, అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమని హెచ్చరించారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసునన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని కెసిఆర్‌ హామీ ఇచ్చారు. పోడు భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.

ఇక నుంచి పోడు భూముల రక్షిస్తామని హామీ ఇవ్వలన్నారు. పోడు భూముల పంపిణీ పూర్తి చేసిన తరువాత అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తూ ఊరుకోమని కెసిఆర్‌ హెచ్చరించారు. భూమి లేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామని కెసిఆర్‌ పేర్కొన్నారు. ఇక నుంచి అటవీ ప్రాంతాల్లోని ఒక చెట్టును కూడా కొట్టనివ్వమన్నారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడుతామని వివరించారు. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత అని తెలియజేశారు. కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెళ్లి చేసుకుంటున్నారని కేసీఆర్‌ వివరించారు.

‘‘66 లక్షల ఎకరాల అటవీ భూముల్లో..11.5 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. ఇకపై అడవులు నరికివేత ఉండదని అంతా ఒప్పుకున్నాకే పోడు భూములు పంపిణీ ఉంటుంది. పోడు భూములకు కరెంట్‌, రైతుబంధు ఇస్తాం. ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం. అడవులను కాపాడే బాధ్యత గిరిజన బిడ్డలే తీసుకోవాలి. ఎవరైనా మన బిడ్డలే.. అందరికీ న్యాయం చేస్తాం. పోడు భూముల సమస్యపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10