విశాఖలో రాజధాని పరిపాలన మొదలు పెట్టడానికి ఇన్నాళ్లు ఏం అడ్డొచ్చింది? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్ర్రశ్నించారు. విశాఖ విషయంలో జగన్ ప్రభుత్వం విధానాలను ఈ సందర్భంగా ఆమె తప్పుబట్టారు. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేశారని, మీ చేతకాని కమిట్మెంట్ అంటూ మండిపడ్డారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్ అని విమర్శించారు. ఆంధ్రుల తలమానికమైన వైజాగ్ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ అంటూ దుయ్యబట్టారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ అని షర్మిల ఫైర్ అయ్యారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు ఆడుతోందని షర్మిల కీలక వ్యాఖ్యలు