AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారుకు సాధ్యం కానిది.. కాంగ్రెస్ చేసింది.. ఏడాది పాలనపై బీఆర్ఎస్‌ నేతలకు నెటిజన్స్ వాతలు

పేరుకే ఏడాది పాలన పూర్తి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగింది కేవలం 4 లేక 5 నెలలు. కొన్ని నెలల్లోనే పాలన అద్భుతః అంటున్నారు తెలంగాణ ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన అభివృద్ధి చూడాలంటే.. కళ్లు తెరిచి చూడాలని, బీఆర్ఎస్ నేతల మాదిరిగా కళ్లు మూసుకుంటే సరిపోదని సోషల్ మీడియా కోడై కూస్తోంది. పదేళ్ల పాలనంతా.. ప్రజలకు చిప్పే మిగిలింది. కానీ కాంగ్రెస్ పాలన ఏమి చేసిందో ఒక్క కళ్లు తెరిచి చూడండయ్యా అంటూ.. బీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకుంటున్నారు నెటిజన్స్.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఇప్పటికే డిసెంబర్ 7, 8, 9 తేదీలలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వాడవాడనా సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల ఆశయం ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే పాలన తెలంగాణలో సాగుతున్న వేళ.. మీ గోల ఏమిటి అంటూ బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు నెటిజన్స్.

బీఆర్ఎస్ కు నెటిజన్స్ సంధిస్తున్న ప్రశ్నలు ఇవే..
1. మీ పాలనలో రుణమాఫీ పూర్తిగా జరిగిందా? 2. మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేశారా? 3. ఉపాధ్యాయ బదిలీలు కాదు సుమా.. ప్రమోషన్స్ ఇచ్చారా? 4. ఇందిరమ్మ ఇళ్లు కాకున్నా.. ఎవరికి (మీ నేతలకా) డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారు? 5. సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చారా? 6. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? 7. అవినీతికి తావు లేకుండా పాలన సాగిందా? 8. ఉద్యోగాలు ఒక్కటైనా భర్తీ చేశారా? 9. డీఎస్సీ నిర్వహించారా? 10. కానిస్టేబుల్స్ నియామకాలు సాగాయా? 11. మోటార్ ట్రాన్స్ పోర్ట్ విభాగం పోస్టులు భర్తీ చేశారా? 12. గృహజ్యోతి అమలైందా? 13. ఏనాడైనా ఉచిత విద్యుత్ ఇచ్చారా? 14. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? 15. విద్యార్థుల సమస్యలు పట్టాయా? 16.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ సాధ్యమైందా? 17. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆలోచన వచ్చిందా? 18. మూసీనది పవిత్రత ఎప్పుడైనా ప్రజలకు చాటిచెప్పారా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10