తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మరోసారి బాంబు పేల్చారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడారన్నారు. అయితే ఇప్పటి వరకు నాగ చైతన్య, సమంతకు విడాకుల విషయమై.. బయట ప్రపంచానికి నిజాలు ఏమిటో తెలియదన్నారు. టాలీవుడ్ నుంచి తనకు అంతర్గతంగా వచ్చిన విషయాన్నే చెప్పానన్నారు. నేటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌తో సహా తెలంగాణలో తిరగడని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లపై ఆమె తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యాలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో… సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లోని అగ్ర హీరోలు సైతం వెంటనే ఆ వ్యాఖ్యలపై స్పందించారు.
తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గదేలేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కొండా సురేఖపై జీహెచ్ఎంసీలోని బీఆర్ఎస్ ఫిర్యాదు చేశారు.