AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘పదేళ్లు రైతులకు ఏం చేయలే.. ఇప్పుడు ధర్నాలు సిగ్గుచేటు’

రైతులకు బీఆర్‌ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్లలో రైతులకు ఏంచేయని ఇప్పుడు ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు బీఆర్‌ఎస్ రూపాయి కూడా పరిహరం కేసీఆర్ ఇవ్వలేదన్నారు. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంకెళ్లు వేశారని, గజ దొంగల్లా బేడీలు వేశారని గుర్తు చేశారు. నేరెళ్ల ఘటన ఎవరి ప్రభుత్వంలో జరిగిందని, రైతులను గోసపుచ్చుకుందని, దాన్ని ఎవరూ కూడా మర్చిపోరన్నారు. వరి వేస్తే ఉరి అని చెప్పినా కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వరి వేయలేదా అంటూ గుర్తు చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అదనంగా ధన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు.కేసీఆర్ లాగా రైతుల విషయంలో మోసం చేసే సర్కార్ తమది కాదని చెప్పారు.

త్వరలోనే రైతులకు సీఎం రేవంత్ తీపికబురు

సీఎం రేవంత్ రైతు సంక్షేమ సర్కార్ నడిపిస్తున్నారన్నారు. త్వరలోనే రైతులకు సీఎం రేవంత్ తీపికబురు చెబుతారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా.. సీఎం రేవంత్ సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారన్నారు. ధర్నాల పేరుతో రైతులను మరోసారి మోసం చేసే పనిలో పడ్డారని మండిపడ్డారు. యావత్ దేశంలోనే రైతుల ఆత్మహత్యలో రాష్ట్రాన్ని రెండో స్థానానికి కేసీఆర్ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమాను వ్యక్తం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10