AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ నిర్మాణాలను కూల్చబోం.. హైడ్రా కమిషర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు..

చెరువులను చెర పట్టి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి అక్రమ కట్టడాలను నిర్మించిన అక్రమార్కులకు హైడ్రా హడలెత్తిస్తోంది.. గత కొద్ది నెలలుగా హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తూ.. చెరువులను కబ్జా కోరల నుంచి విడిపిస్తూ హైడ్రా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో హైడ్రా కమిషర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి తీసుకున్న, నిర్మించుకున్న ఇళ్లను కూల్చబోము అంటూ క్లారిటీ మరోసారి క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషర్ రంగనాథ్. జూలై తర్వాత నిబంధనలకు నిర్మించిన ఇళ్లపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చెరువు చుట్టు పక్క ప్రక్కల ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలు డంప్ చేయకూడదు అంటూ హెచ్చరించారు. మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ కూకట్‌పల్లిలో కాముని చెరువు, మైసమ్మ చెరువులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కాముని చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడిన తర్వాత జరిగిన ఆక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామన్నారు రంగనాథ్. 2024 జూలై నాటికే అక్కడ నివాసాలు వుంటే వాటి జోలికి హైడ్రా వెళ్లదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నిబంధన వాణిజ్య సముదాయాలకు వర్తించదన్నారు. ప్రభుత్వ విభాగాల అనుమతులున్న నిర్మాణాల జోలికి కూడా హైడ్రా వెళ్లదంటూ క్లారిటీ ఇచ్చారు. కాముని చెరువు, మైసమ్మ చెరువు పరిసరాల్లో నివాసితులు చెరువులు కబ్జా కాకుండా చూడాలని స్థానికులకు విజ్ఞప్తి చేసారు.

కాగా.. మూసాపేట, ఖైతలాపూర్ పరిధిలోని కాముని చేరువులో నిర్మాణ వ్యర్థాలతోపాటు మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారని, చెరువులకు అనుసంధానంగా ఉండే కాలువలు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కాముని చెరువులో మట్టిపోసినవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10