AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌, కిషన్ రెడ్డి లను ఆహ్వానిస్తాం: పొన్నం ప్రభాకర్

రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైంది. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల చివరి రోజైన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు మాజీ ముఖ్మమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఆహానిస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. 9న జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు ఇన్వైట్ చేసేందుకు వారి సిబ్బంది ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నట్లు చెప్పారు. వాళ్లు ఇచ్చిన టైం ప్రకారం.. ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆ దిశగా తొలి ఏడాదిలోనే మార్పు చూపించింది. సంక్షేమంతో పాటే అభివృద్ధి పనులు చేపట్టింది. ఎన్నెన్నో రికార్డులు సృష్టించింది. హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్యూచర్ సిటీ అయినా, మూసీ పునరుజ్జీవమైనా, మెట్రో సెకెండ్ ఫేజ్ అయినా, రాష్ట్రవ్యాప్తంగా చిన్ననీటి పారుదల ప్రాజెక్టులైనా ఇలా అభివృద్ధి దిశలో తొలి ఏడాది కొత్త అడుగు పడింది. మొత్తం 24 కొత్త పాలసీలను సీఎం తొలి ఏడాదిలోనే టేకప్ చేశారంటే వచ్చే నాలుగేళ్లలో దశదిశ ఎలా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10