AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరంగల్ చపాటా మిర్చికి అరుదైన గుర్తింపు

వరంగల్ చపాటా మిర్చికి అరుదైన గుర్తింపు లభించింది. తక్కువ కారం.. ఎర్రటి రంగు చూడటానికి టమాటా లాగా ఉంటుంది. అదే వరంగల్ చపాటా మిర్చి. వరంగల్ జిల్లా తిమ్మంపేట చిల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ నర్సంపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కు చెందిన మల్యాల పరిశోధన స్థానం సంయుక్తంగా ఈ పంటకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీ ఐ) కి 2022లో దరఖాస్తు చేశారు. ఇటీవల చపాట మిర్చి గూర్చి చెన్నై లోని జీ ఐ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది.

దీనితో ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ( ఐపివో) ఆమోదం తెలిపింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ జర్నల్ లో చపాటా మిర్చి గూర్చి వివరాలు పబ్లిష్ చేశారు. ఈ మిర్చి గూర్చి 27 మార్చి 2025 వరకు అభ్యంతరాలు జీ ఐ వారు స్వీకరించనున్నారు. ఎలాంటి అభ్యంతరాలు పోతే చపాటా మిర్చి కి జీ ఐ ట్యాగ్ ఇవ్వనున్నారు. ఈ మిర్చి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా సాగు చేయనున్నారు. గతంలో ఈ మిర్చికి వరంగల్ ఎనుమముల మార్కెట్ లో క్వింటాల్ కు సుమారుగా రూ 90 వేల వరకు పలికింది. జీ ఐ ట్యాగ్ వస్తే మరింత ధర పెరిగే అవకాశం ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10