AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యుద్ధ ట్యాంకర్లు మన దగ్గరే తయారీ.. సరిహద్దుల్లో సవారీ.. సంగారెడ్డి చెరువులో ట్రయల్‌ రన్‌

 సరిహద్దుల్లో బాంబుల గర్జనలు చేసే యుద్ధ ట్యాంకర్లు.. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ప్రత్యక్షమయ్యాయి. భారీ ఆకారంతో యుద్ధ మైదానాల్లో పరుగులు తీసే ఈ ట్యాంకర్లు చెరువులో పడవల ప్రయాణిస్తూ.. స్థానిక ప్రజల ఆకట్టుకున్నాయి. కొండలు, గుట్టలు, పర్వతాలను అధిరోహించే ఈ యుద్ధ ట్యాంకర్లు ఎందుకు మల్కాపూర్ చెరువులో దిగాయి. ఇక్కడి నీటిలో ఎందుకు చక్కర్లు కొట్టాయో తెలుసుకుందాం..

సంగారెడ్డి జిల్లాలోని ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచే వీటిని భారత సైన్యానికి అందిస్తుంటారు. ఇవి దేశం నలుమూలల భారత సైనిక దళాల్లో చేరి విధులు నిర్వహిసుంటాయి. అలాంటి ట్యాంకర్లు కఠినమైన మైదానంలోనే కాకుండా.. నీటిలోనూ ప్రయాణం సాగించేందుకు వీలుగా రూపొందించారు. యుద్ధక్షేత్రాల్లో ఎక్కడైనా కాలువలు, నదులు ఎదురైతే ఆ అడ్డంకులను సులువుగా అధిగమించేలా వీటిని డిజైన్ చేశారు.

ఈ కారణంగానే యుద్ధ ట్యాంకర్లను మల్కాపూర్ లోని మైదాన ప్రాంతాలతో పాటు ఇక్కడి చెరువులోనూ ట్రైయల్ రన్ నిర్వహించారు. నీటిలో ప్రయాణించేటప్పుడు ఇవి ఏ తీరుగా పనిచేస్తున్నాయో శాస్త్రవేత్తల బృందం పరీక్షించింది. ఈ సమయంలో యుద్ధ ట్యాంకర్లు, వాటి విన్యాసాలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు గుమ్మిగుడారు. వీటి విన్యాసాలు ప్రయాణాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపడ్డారు.

ఎద్దుమైలాపూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన ఈ యుద్ధ ట్యాంకర్.. ఒక్కొక్కటి 14.5 టన్నుల బరువుతో రూపొందించారు. ఈ ట్యాంకర్ పై ఒకేసారి పదిమంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. నేల మీదే కాకుండా నీటిలో ప్రయాణించే సమయంలోనూ ఈ ట్యాంకర్ పై పదిమంది ప్రయాణించవచ్చని చెబుతున్నారు. ట్రయల్ రన్ సమయంలోను ట్యాంకర్ పై పదిమంది కూర్చుని చెరువులో ప్రయాణించారు.

ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ తరహా యుద్ధ ట్యాంకుల్ని ఉత్పత్తి చేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. దాదాపు 3500 ట్యాంకర్లను భారత సైన్యానికి అందించింది. మరిన్ని ట్యాంకర్లను రూపొందిస్తూ సైనిక దళాలను పటిష్టం చేయడంలో విరామం లేకుండా కృషి చేస్తోంది ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఇక్కడ తయారవుతున్న యుద్ధ ట్యాంకర్లను అనేక పరిస్థితుల్లో, వివిధ ప్రాంతాల్లో పరీక్షిస్తూ.. వాటి సామర్థ్యాలను పరిశీలిస్తుంటారు. వాటిలో ఏమైనా లోటుపాట్లుంటే.. సరిచేసి అప్ గ్రేట్ చేస్తుంటారు. అందుకే ఇక్కడ నిర్వహించిన ట్రయల్ రన్ లకు ప్రత్యేకత ఉంటుంది. పైగా.. ఈ ట్యాంకర్లు యుద్ధ క్షేత్రాల్లో కీలక భూమిక పోషిస్తుంటాయి కాబట్టి.. ఇలాంటి వెహికిల్స్ ఎంత సమర్థవంతంగా, అత్యాధునికంగా ఉంటే మన సైనిక దళాలు అంత పటిష్టంగా ఉంటాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10