ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీశ్ (SI Harish) ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. అయితే ఏటూరునాగారంలో ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే ఆయన సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు దర్యాప్తు చేపట్టారు.