AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్ టెట్ హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

టీఎస్ టెట్ 2024 హాల్ టికెట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం సాయంత్రం 6 గంట‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి హాల్ టికెట్లు. వాస్త‌వానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుద‌ల చేస్తామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఒక రోజు ఆల‌స్య‌మైంది. నిన్న‌టి నుంచి టెట్ అభ్య‌ర్థులు హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మొత్తానికి గురువారం సాయంత్రం టెట్ హాల్ టికెట్ల‌ను వెబ్‌సైట్‌లో ఉంచారు.

టెట్ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే జ‌ర్న‌ల్ నంబ‌ర్, పుట్టిన తేదీ(టెన్త్ మెమో) త‌ప్ప‌నిస‌రి. ఈ రెండు లేక‌పోతే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవ‌డం అసాధ్యం. ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించిన‌ప్పుడు జ‌ర్న‌ల్ నంబ‌ర్ జ‌న‌రేట్ అయి ఉంటుంది. ఆ నంబ‌ర్‌తో పాటు పుట్టిన తేదీని స‌మ‌ర్పించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం https://tstet2024.aptonline.in/tstet ఈ వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.

ఇక టెట్ ప‌రీక్ష‌లు ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రెండు విడ‌త‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10