జీవితం ఎప్పుడు ఎలా ముగిస్తుందో ఎవ్వరు చెప్పలేరు. నిన్నటి వరకు మనతోటి, మన పక్కన ఉన్న వ్యక్తి నేడు మన మధ్య ఉండకపోవచ్చు. జీవితం చాలా చిన్నది కాబట్టి ఉన్న సమయంలో ఆనందంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. తాజాగా ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కెమెరామెన్ కమలనాడి ముత్తు తిరువల్లువన్ అలియాస్ తిరు మరణించాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) రెండో సీజన్ ఎంతో ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌ను కెమెరామెన్ ముత్తు కవర్ చేశారు. అయితే.. శనివారానికి ఆయన మన మధ్యలో లేడు. ఆయన మరణం పట్ల పలువురు క్రికెటర్లతో పాటు ప్రముఖ వ్యాఖ్యత హర్షాబోగ్లే సంతాపం తెలియజేశారు. అతడి మృతికి సంతాపంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో కెమెరామెన్‌లు చేతికి నల్లరిబ్బన్లు కట్టుకున్నారు.