సికింద్రాబాద్‌లోని ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు.
సికింద్రాబాద్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ లో విరల్ జైన్ అనే బాలుడు ఆరవ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే బడికి వచ్చి చదువుకున్నాడు. మధ్యాహ్నం అయింది. తన క్యారేజ్ తీసుకొని తినేందుకు కూర్చున్నాడు. తోటి విద్యార్థులు కూడా అలాగే కూర్చొని తినడం ప్రారంభించారు. విరల్ జైన్ కూడా తన క్యారేజ్ ఓపెన్ చేసి, చపాతీ తినడం ప్రారంభించాడు. చపాతీ అంటే చపాతీ రోల్ తీసుకొని నోటిలో పెట్టుకున్నాడు.
అలా కాస్త తిన్నాడు. మరలా కాస్త ఆరగించాడు. ఇక అంతే ఊపిరి ఆడని పరిస్థితి. సక్రమంగా శ్వాస అందకపోవడంతో తన స్నేహితులకు తెలిపాడు. వారు హుటాహుటిన పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. ఉపాధ్యాయులు కూడా అసలేం జరిగిందంటూ ఉరుకులు, పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. చివరికి ప్రవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సమాయత్తమై స్పీడ్ గా జైన్ ను వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే ఊపిరి ఆడకుండా ఇబ్బందులు ఎదుర్కొన్న జైన్, పాపం మార్గమధ్యలోనే విలవిలలాడాడు. చివరికి తన ప్రాణాలు వదిలాడు.