ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటోంది. ప్లేఆఫ్‌కు చేరుకునేందుకు అన్ని జట్లు పోటా పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా మరో బిగ్ ఫైట్ జరగనుంది. నేడు కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ లో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది మ్యాచ్‌లో విజయం సాధించింది. అటు ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్‌లు వాడి కేవలం నాలుగు విజయాలు సాధించింది. ఇక ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరుకునే అవకాశలు దాదాపు కష్టంగా కనిపిస్తున్నాయి.