రాష్ట్రంలో యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలిచ్చి, వసతులు కల్పించి వారి అవసరాలు తీర్చే ఏర్పాట్లు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. మధిర నియోజకవర్గంలోని ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని అన్నారాయన. వారు వ్యాపారం చేసుకోవడానికి పరిశ్రమలు, ప్రాజెక్టు రిపోర్టు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ వసతులు కల్పించి ప్రోత్సహిస్తామన్నారు.
ఇండస్ట్రియల్ పార్కుతో మధిర పట్టణం విద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కేంద్రంగా మారనుందని స్పష్టం చేశారు. గ్రామాల్లోని యువత పరిశ్రమల ఏర్పాటు చేస్తామంటే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మధిరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం దశాబ్దాల కల అన్నారు. 55 ఎకరాల్లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కు కు 44 కోట్ల నిధులు కేటాయించామని భట్టి తెలిపారు. పనులకు వెంటనే టెండర్లు పిలిచి వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.