మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అప్పుల బాధతో ఓ కుటుంబం పరుగుల మందు తాగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాండూరు మండలం కాసిపేటలో మంగళవారం చోటు చేసుకున్నది. మొండయ్య (55) అనే రైతు అప్పుల బాధతో భార్య శ్రీదేవి (50), కూతురు చైతన్య (22), కొడుకుతో కలిసి పురుగుల మందు తాగారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మొండయ్య, భార్య శ్రీదేవి, కూతురు చైతన్య ప్రాణాలు కోల్పోయారు. కొడుకు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అప్పుల బాధ భరించలేక ఉసురు తీసుకోవడంతో పలువురు కన్నీటి పర్యంతయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.