AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంతా డొల్ల.. బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫైర్‌

ఇది అర్బక ప్రభుత్వం
– అన్ని వర్గాలనూ మోసం చేసింది
– దళిత బంధు ఏదీ? వారి గొంతు కోశారు..
– భట్టివన్నీ వట్టి మాటలే..
కాంగ్రెస్‌ సర్కార్‌ను చీల్చి చెండాడుతాం
బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫైర్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన వాఖ్యలు చేశారు. గురువారం జరిగిన బడ్జెట్‌ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ విరామంలో ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్‌లో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇది రైతు శత్రు ప్రభుత్వం. బడ్జెట్‌లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదన్నారు. దళితబంధు ప్రస్తావన ఎక్కడా రాకుండా దళితుల గొంతు కోశారని ఆక్షేపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు మొండిచేయి చూపించారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదని అన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని అనుకున్నాం. కానీ, ప్రభుత్వానికి అసలు పాలసీనే లేదని, ఆ విషయం బడ్జెట్‌ చూశాక అర్థం అయిందని అన్నారు. మంత్రి భట్టి విక్రమార్క అన్ని వట్టి మాటలే చెప్పారంటూ గులాబీ బాస్‌ ఫైర్‌ అయ్యారు.

కొత్త నాటకం..
రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. బడ్జెట్‌ వాస్తవానికి దూరంగా ఉంది. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదు. ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదు. ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదు. మహిళలకూ ఇచ్చిందేమి లేదు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా సరిగ్గా లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోరడతారు. కాంగ్రెస్‌ మోసపూరిత ఎన్నికల వాగ్ధానాలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదు‘ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10