(అమ్మన్యూస్, హైదరాబాద్):
మంత్రి కొండా సురేఖవి దొంగ ఏడుపులు అని, దేనికీ ఈ పెడబొబ్బలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటని, అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు. ‘‘మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం.. భార్య.. పిల్లలు లేరా?’ అని ప్రశ్నించారు. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో మాకు సంబంధం లేదు. కొండా సురేఖ ఏడిస్తే మాకేమి సంబంధం అని అన్నారు. నాడు సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా అని అన్నారు.
చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకనే దాడులు చేయిస్తోందన్నారు. సెక్యూరిటీ లేకుండా మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులు మూసీ ప్రాంతంలో తిరగాలన్నారు. జగ్గారెడ్డి, మధు యాష్కీలు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య అండర్ స్టాండింగ్ ఉందని.. అందుకే పొంగులేటి ఇంటిపై ఐటీ దాడుల గురించి బీజేపీ మాట్లాడటం లేదన్నారు. మూసీ బాధితుల కోసం గురువారం ఎల్బీనగర్కు వెళుతున్నామని.. కాంగ్రెస్ వాళ్ళుఅడ్డొస్తే ఏం చేయాలో అది చేస్తామన్నారు. ‘‘మా ఆత్మరక్షణ కూడా మేము చూసుకోవాలి కదా’’ అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.