AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరు గ్యారంటీల అమలులో వెన‌క్కి త‌గ్గేది లేదు.. మ‌హ‌రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో రేవంత్

దేశంలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో జరుగుతున్నాయని ఆరోపించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. దీని తర్వాత తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉండేదని చెప్పారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. మ‌హ‌రాష్ట్ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో ప్రచారం చేసేందుకు ముంబ‌యి వెళ్లిన రేవంత్ అక్క‌డి మీడియాతో నేడు మాట్లాడుతూ,రైతుల సంక్షేమం కోసం ఎలాంటి పనులు చేపట్టలేదని విమర్శించారు. రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వలేదని, రైతుల కోసం మోడీ నల్లచట్టాలను తెచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారని అన్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ గురించి, తమ ఆరు గ్యారెంటీల గురించి అబద్ధాలు బెబుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ మాపై దుష్ప్రాచారం చేయడం ఆపకపోవడం వల్ల తాను నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ గ్యారెంటీలను ప్రణాళిక బద్దంగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను మహారాష్ట్ర ప్రజల ముందు పెట్టడం తన బాధ్యత అని అన్నారు.

తెలంగాణలో ఉన్న రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులుకు రూ.17,869 కోట్లు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రతి రైతు డేటాను ఇస్తానని తెలిపారు. ఇటీవల ప్రధాని మోడీ ట్వీట్ చేశారని, రుణమాఫీపై పూర్తి వివరాలు ఇవ్వడంలో ప్రధాని ట్వీట్ డిలీట్ చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గ్యారెంటీ వల్ల సిద్దించిందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10