ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబైతో జరుగుతున్న మ్యాచ్ ఢిల్లీ ప్లేయర్లు అదరగొట్టారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు భారీ టార్గెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. టాస్ ఓడి బరిలోకి దిగిన ఢిల్లీ ప్రత్యర్థి ముంబైని హడలెత్తించింది. ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ మంచి ఆరంభాన్ని అందించారు. ప్రధానంగా జాక్ ఫ్రేసర్ 27 బంతుల్లో 84 పరుగులు చేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై విజృంభించాడు. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు. హోప్ 17 బంతుల్లో 41 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ కూడా 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. చివరిలో స్టబ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్టబ్స్, అక్షర్ పటేల్‌లు చివరిలో దూకుడుగా ఆడడంతో ఢిల్లీ భారీ టార్గెట్‌ను ముంబై జట్టు ముందు పెట్టింది. అదే విధంగా ముంబై బౌలర్లలో జస్పీత్ బుమ్రా, నువాన్ తుషార, పీయూష్ చావ్లా తలా రెండు వికెట్లు తీశారు. ఇక 258 భారీ విజయ లక్ష్యంతో ముంబై జట్టు బరిలోకి దిగనుంది.
ఇరు జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కుమార్ కుషాగ్రా, షాయ్ హోప్, రిషబ్ పంత్ (సీ, డబ్ల్యూకే ), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్
ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (డబ్ల్యూకే), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (సీ), టీమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార
.